CM Chandrababu- Seethakka: తెలంగాణ మంత్రి సీతక్కకు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఆత్మీయురాలు, సోదరి, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చంద్రబాబు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
నాకు అత్యంత ఆత్మీయురాలు, సోదరి, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.@seethakkaMLA pic.twitter.com/Dzx3B1icHI
— N Chandrababu Naidu (@ncbn) July 9, 2025
సీతక్కకు తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆమె సొంత సోదరుడిలాగా భావిస్తారు. సీతక్క గతంలో నక్సలైట్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అమె అడవిబాట పట్టిన తన పేరును సీతక్కగా మార్చుకున్నారు. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ. అయితే ప్రజలకు సేవ చేసేందుకు అడవిబాట నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె ఆసక్తి గమనించిన చంద్రబాబు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్కకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా కానీ నిరుత్సాహపడకుండా పార్టీ కోసం పనిచేశారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. దీంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Also Read: కల్తీ కల్లు బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి జూపల్లి
ఇక రాష్ట్ర విభజన అనంతరం కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్న ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ లేదనుకుని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. అనతంరం రాహుల్ గాంధీ సమక్షంలో టీడీపీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా కానీ ఆమె చంద్రబాబుకు శిష్యురాలిగానే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును కలుస్తూ తన విధేయత చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సోదరి సోదర భావం ఏర్పడింది. టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి అంచెంచెలుగా స్వయంకృషితో ఎదుగుతూ మంత్రి స్థాయికి సీతక్క ఎదిగారు. దీంతో తమ మధ్య ఉన్న సోదర భావనను చాటుకుంటూ సీతక్క పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.


