Saturday, November 15, 2025
HomeతెలంగాణCM Chandrababu: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం: పరామర్శించిన సీఎం చంద్రబాబు!

CM Chandrababu: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం: పరామర్శించిన సీఎం చంద్రబాబు!

Deputy CM Health : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లారు.

- Advertisement -

సీఎం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వపరమైన ముఖ్యమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో ఉపముఖ్యమంత్రి అనారోగ్యం పాలవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

విశ్రాంతి అవసరం అన్నా ఆగని పవన్
పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఆయన కార్యాలయం జనసేన పీఏసీ ఒక ప్రకటన విడుదల చేసింది. జ్వరం తీవ్రంగా ఉన్నందున వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలను పక్కన పెట్టలేకపోయారు.

విశ్రాంతి అవసరమైనప్పటికీ, మంగళవారం రోజున ఆయన శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం వంటి తన శాఖలకు సంబంధించిన పనుల్లో జాప్యం జరగకుండా చూసేందుకు పవన్ కళ్యాణ్ అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్నారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad