Wednesday, September 18, 2024
HomeతెలంగాణCM distributed Rythu Runa Mafi checks: ల‌క్ష రుణ‌మాఫీలో అందోల్ దే అగ్ర‌భాగం

CM distributed Rythu Runa Mafi checks: ల‌క్ష రుణ‌మాఫీలో అందోల్ దే అగ్ర‌భాగం

రుణమాఫీ అయిన రైతులకు చెక్ లు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ల‌క్ష రుణ‌మాఫీలో రాష్ట్రంలో మొద‌టి స్థానంలో అందోల్ నియోజ‌క‌వ‌ర్గం నిలిచింది. ఆ త‌ర్వాత స్థానాల్లో హుస్నాబాద్‌, క‌ల్వ‌కుర్తి రెండు, మూడు స్థానాలు ద‌క్కించుకున్నాయి. రూ.రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీలో భాగంగా మొద‌టి విడ‌త‌లో రూ.ల‌క్ష వ‌ర‌కు రుణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం మాఫీ చేసింది.

- Advertisement -

రాష్ట్రంలోని 110 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని (9 న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతు రుణాలు లేవు) 10,84,050 రైతు కుటుంబాల‌కు చెందిన 11,50,193 మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,098.93 కోట్లను రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌మ చేసింది.

దీంతో ఆ కుటుంబాల‌న్నీ రుణ‌విముక్తం అయ్యాయి. రుణ‌మాఫీ జ‌రిగిన 110 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలో 19,186 రైతు కుటుంబాల‌కు చెందిన 20,216 మంది రైతుల‌కు చెందిన రూ.107.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

త‌ర్వాత హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 18,101 రైతు కుటుంబాల‌కు చెందిన 18,907 మంది రైతుల‌కు చెందిన రూ.106.74 కోట్లు, క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 17,270 రైతు కుటుంబాల‌కు చెందిన 18,196 మంది రైతుల‌కు చెందిన రూ.103.02 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News