Tuesday, September 17, 2024
HomeతెలంగాణCM KCR: ఎండల తిరిగిండు... సద్దన్నం తిన్నడు

CM KCR: ఎండల తిరిగిండు… సద్దన్నం తిన్నడు

పంట నష్టాల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత నిరాడంబరంగా ప్రవర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పర్యటన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మూడు ఉమ్మడి జిల్లాల మీదుగా జరిగింది. ఎక్కడా భోజనం, టీ, స్నాక్స్ వంటి విరామిలకు తావివ్వలేదు. పైగా తన వెంటే తెచ్చుకున్న సదన్నాన్ని తిన్నారు. అదీ తన బిజీ షెడ్యూల్ లో కొద్దిపాటి విరామాన్ని కల్పించుకుని, తాను ప్రయాణించిన బస్సులోనే మిగతా మంత్రులు, వెంట వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసే తిన్నారు. ఈ సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా సీఎం గారికి, మంత్రులు, అధికారులందరికీ వడ్డించారు.

- Advertisement -

అలాగే నేరుగా వీలైనంత రాజకీయాంశాలు తగ్గించేసి, నేరుగా రైతులతోనే మాట్లాడి, వేదికల వద్ద రైతులనుద్దేశించి పరిమితంగా, సూటిగా పరిహారానికి సంబంధించి మాత్రమే ప్రసంగించారు. దీంతో సీఎం సభలు అంటే చాలు సహజంగా ఉండే హంగు, ఆర్భాటాలు, హడావుడి ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి సిఎం హైదరాబాద్ చేరేలోగానే ఎకరానికి రూ.10వేల పంటల నష్ట పరిహారానికి సంబంధించిన జీవోని జారీ చేయించారు. ఇచ్చిన మాటను మాటను నిలుపుకుంటూ, గంటల్లోనే జీవో జారీ చేయడంతో పంటలు నష్టపోయిన రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లవిరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News