Friday, December 27, 2024
HomeతెలంగాణCM Revanth Condolence message: మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Condolence message: మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాది: సీఎం రేవంత్ రెడ్డి

సంతాప సందేశం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు… మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతిపై X లో తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు.. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు..రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News