మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులు, ప్రజంప్రతినిధుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్, ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, మహబూబ్ నగర్ ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో వెల్లడించారు.
సీఎం రేవంత్ జిల్లా టూరుకు హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు.