ఈఎన్సీ మురళీధరన్, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆలస్యమైనా, సరైనదే. 21 అక్టోబర్ 2023న మేడిగడ్డ సమస్య వెలువడిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాల్సినది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడే సాహసం చేయని విధంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పాల్గొన్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలి మరియు ఇప్పటికే ఉన్న కాంట్రాక్టుల నుండి వారిని పక్కన పెట్టాలంటూ రేవంత్ సర్కారు సంచలన ఆదేశాలు జారీచేసింది.
నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన..
నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసిన రేవంత్ సర్కారు ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావ్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రాష్ట్రంలో సంచలనం, మరెవ్వరూ ఇలా చేయరాదు..
కాళేశ్వరం ప్రాజెక్టు మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల బృందం స్వయంగా మెడిగడ్డ తోపాటు బ్యారేజ్ లను సందర్శించి డ్యామేజ్ లను పరిశీలించారు. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో అధికారులపై చర్యలు తీసుకుంది తెలంగాణా సర్కారు.
విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు..
విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావటంతో నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంది ప్రభుత్వం. నీటి పారుదల శాఖ ఈఎన్ సి మురళీధర్ రావ్ ను రాజీనామా చేయాలని ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్ సి వెంకటేశ్వర్ రావ్ ను సర్వీసు నుంచి తొలగిస్తూ తీవ్రమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.
అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖలో ప్రక్షాళన చేయడంలో సంచనలంగా వ్యవహారం మారింది. కాళేశ్వరం అవినీతి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకోవడంతో ఇంకా ఎంత మండిపై చర్యలు ఉంటాయోనని చర్చ. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలలో నీటి పారుదలపై శ్వేత పత్రం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. శ్వేతపత్రం ముందే భారీ చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంతో రాష్ట్రంలో సంచలన అంశంగా మారిపోయిన కాళేశ్వరం వ్యవహారం. కాళేశ్వరం ప్రాజెక్టు 90 వేల కోట్లతో నిర్మించిన ప్రయోజనం లేకపోగా చివరకు అప్పులు మీద పడి గుదిబండగా మారే ప్రమాదం ముంచుకొచ్చింది.