Monday, September 16, 2024
HomeతెలంగాణCM Revanth first puja in Khairatabad: ఖైరతాబాద్ మహా గణఫతికి తొలి పూజ...

CM Revanth first puja in Khairatabad: ఖైరతాబాద్ మహా గణఫతికి తొలి పూజ చేసిన సీఎం రేవంత్

గణేష్ మండపాలకు ఫ్రీ పవర్

ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు.

- Advertisement -

70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుందన్నారు.

హైదరాబాద్ నగరంలో 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారని, గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించామన్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు రేవంత్.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి నా అభినందనలన్న ఆయన, స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా అంటూ గుర్తుచేసుకున్న రేవంత్, ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News