తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసి, ఆతరువాత ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అయిన రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ సంతకం చేశారు.
- Advertisement -
బోయిగూడ కమాన్ లో నివాసం ఉంటున్న రజనీకి రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపి, పిలిపించి ఈ మేరకు ఆమెకు ప్రభుత్వ ఉద్యోగిగా నియామక పత్రాన్ని చేతికి అందించటం హైలైట్. ఉన్నత విద్య పూర్తి చేసినా తాను నిరుద్యోగిగా ఉన్న విషయాన్ని గాంధీభవన్ కు వెళ్లి గతంలో రేవంత్ కు ఆమె వివరించగా అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు రజనీకి ఉద్యోగం ఇచ్చి మాట నిలుపుకున్నారు.