KTR| ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం..మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం. కంచంలో పురుగులు..కాటేసే పాములు..కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం..అదానితో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటం. కనీస వసతులు లేక, సరిపడా మరుగుదొడ్లు లేక అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం..లగచర్లపై లాఠీ విరిచి రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటం.
పురుగుల అన్నం తిని అంబులెన్స్‌లో విద్యార్థులు..పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్‌లో రేవంత్, మంత్రుల షికార్లు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి..విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా?” అంటూ కేటీఆర్ నిలదీశారు.