Sunday, June 23, 2024
HomeతెలంగాణCM Revanth in command control centre: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం...

CM Revanth in command control centre: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్

మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త.

- Advertisement -

వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలన్న సీఎం. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, మంత్రులు. ఇప్పటికే 141వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపిన అధికారులు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించిన అధికారులు.

నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు. రోడ్డుపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన అధికారులు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్న సీఎం.

ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News