Sunday, December 8, 2024
HomeతెలంగాణCM Revanth in Police flag day parade: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం...

CM Revanth in Police flag day parade: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్

సెల్యూట్..

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో అమరవీరుల స్థూపానికి నివాళ్లర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన రాష్ట్ర డీజీపీ జితేందర్. పోలీస్ ఉన్నతాధికారులు. పోలీస్ అమరవీరుల కుటుంబాలు.

- Advertisement -

విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికి తెలంగాణ తరపున నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోని 140 కోట్ల ప్రజలు గుండెలపై చేయి వేసుకొని నిద్ర పోతున్నారంటే దానికి కారణం పోలీసులేనన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే శాంతి భద్రతలు అత్యంత కీలకమని, శాంతి భద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణలో పోలీసులు అవసరమైతే తమ ప్రాణాలైనా వదులుతున్నారు కాని శాంతి భద్రతల్లో మాత్రం వైఫల్యం చెందకుండా కాపాడుతున్నారు.. వారికి అభినందనలు

అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయనే విశ్వాసాన్ని ఈ కార్యక్రమం ద్వారా  కల్గిస్తున్నట్టు, అమరులైన పోలీసుల కు నివాళులర్పించడం ద్వారా స్పూర్తిని నింపుతున్నామని సీఎం అన్నారు. కె ఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర , కృష్ణ ప్రసాద్ లాంటి వందలాది మంది పోలీసు అధికారులు అమరులై శాంతి భద్రతలను కాపాడటంలో స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News