Sunday, June 15, 2025
HomeతెలంగాణCM Revanth in Warangal tour: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్, 45 రోజుల్లో...

CM Revanth in Warangal tour: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్, 45 రోజుల్లో మళ్లీ రివ్యూ

వరంగల్ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని, హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరో 45 రోజుల్లో మళ్లీ వరంగల్ లో అభివృద్ధి పనులను తాను రివ్యూ చేయనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.

- Advertisement -

సమర్ధత ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయన్న రేవంత్.. ఈ ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపిత బదిలీలు, రాజకీయ అవసరాల కోసం బదిలీలు ఉండవని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మన కర్తవ్యమన్నారు. వరంగల్ అభివృద్ధిపై ఇది ప్రాథమిక సమీక్ష మాత్రమేనన్న ఆయన, మళ్లీ 45 రోజుల్లో వరంగల్ అభివృద్ధిపై మరో సమీక్ష నిర్వహిస్తా అని ప్రకటించటం విశేషం.

హనుమకొండలో మెడికవర్ హాస్పిటల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు సీఎం. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహించిన సీఎం, నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమేంటన్నారు.

నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిన సీఎం, నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News