Tuesday, April 1, 2025
HomeతెలంగాణCM Revanth: తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం.. ప్రారంభించి సీఎం రేవంత్..!

CM Revanth: తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం.. ప్రారంభించి సీఎం రేవంత్..!

తెలంగాణలో పేద ప్రజలకు పెద్దఎత్తున ఉపశమనం కలిగించే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందుబాటులోకి రానుంది. నల్లగొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ప్రతి పేదవాడు పోషకాహారంతో కూడిన మంచి బియ్యం తినాలి. అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తునట్లు పేర్కొన్నారు.

- Advertisement -

సన్న బియ్యం పథకం కాంగ్రెస్ సంకల్పం: ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం నిలబడతుందని, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన నల్లగొండ జిల్లా మరోసారి ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్షాన మలిచిందని సీఎం గుర్తుచేశారు. రేషన్ షాపుల ద్వారా అందుతున్న దొడ్డు బియ్యం సరిగ్గా పంపిణీ కాకుండా, మిల్లర్లు దాన్ని 10 రూపాయలకు కొని ప్రభుత్వానికే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి ఏటా 10 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేసింది. అయితే, మన ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా SLBC ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అయితే, కాంగ్రెస్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి చేసిన కృషితో ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొందిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని, రైతు బంధును కూడా రద్దు చేయకుండా కొనసాగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతుల గుండెల్లో ఇందిరమ్మ, సోనియమ్మ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే, రైతులకు న్యాయం చేయడం తమ బాధ్యత అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఈ పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం స్పష్టం చేశారు. ఎవరైనా సీఎంగా ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ పథకాన్ని నిలిపివేయలేరని రేవంత్ అన్నారు. ఇది ప్రజల హక్కు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News