Saturday, December 6, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: సింగపూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పడవ ప్రయాణం

CM Revanth Reddy: సింగపూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పడవ ప్రయాణం

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సింగపూర్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన ఓ నదిలో పడవ ప్రయాణం చేశారు. ఫెర్రీలో ప్రయాణిస్తూ నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై ఆ దేశ ప్రభుత్వం అనుసరించిన విధానాలను పరిశీలించారు. అలాగే నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ పర్యటనలో భాగంగా తాజాగా క్యాపిటల్‌ ల్యాండ్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇక రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ స్థాపించేందుకు ఎంవోయూ(MOU) చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News