Friday, April 4, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్ దమ్ముంటే రా.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్

CM Revanth Reddy: కేసీఆర్ దమ్ముంటే రా.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు. హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌(KCR)తో పాటు గులాబీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేసినా జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం కోల్పోయామో ప్రజలు ఈ 11 నెలల్లోనే తెలుసుకున్నారని వివరించారు.

- Advertisement -

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఇక కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లోనే ఉండాలని సూచించారు. కావాలంటే రోజూ ఫామ్‌హౌజ్‌కు లిక్కర్ తానే పంపిస్తానని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కానీ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేసి తీరుతామని.. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే చర్చ పెడదామని తెలిపారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అని సవాల్ విసిరారు. అసలు అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News