Friday, April 4, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014-18 మధ్య కేసీఆర్(KCR) మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేని విషయం గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించామని.. అది కూడా ఇద్దరు వరంగల్ జిల్లాకు చెందిన వారికే స్థానం కల్పించామని పేర్కొన్నారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే.. కొండను బద్దలు కొట్టింది కూడా ఆడబిడ్డనే అన్నారు. అందుకే తమది ఇందిరమ్మ రాజ్యమని గర్వంగా చెబుతున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసి కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

- Advertisement -

తనకు ముఖ్యమంత్రి సీటు కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ఇచ్చిన గౌరవమన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కనీసం కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఘోష పడిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నామన్నారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కష్టపడుతున్నారని.. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఎంతో పట్టుదలగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో అనేక ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం ఒక్కటే ఎయిర్‌పోర్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేస్తామనగానే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చేయరు.. చేసే వారిని చేయనియ్యరని విమర్శించారు. ఎవరు అడ్డు వచ్చినా చేపట్టిన అభివృద్ధి పనులు ఆపబోం అని స్పష్టంచేశారు. తెలంగాణలో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని రేవంత్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News