ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ నేడు పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం (Yuva Vikasam) సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ (KCR) పై విమర్శలు గుప్పించారు. ఆయన శాసనసభకు వచ్చి తన మేధావితనాన్ని ప్రజలకి తెలియజేయాలన్నారు. ఎకరంలో రూ.కోటి రూపాయల పంట ఎలా పండించారో వివరించాలన్నారు. అందరికీ తెలిసేలా లైవ్ పెడతామని రేవంత్ అన్నారు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి… రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వండి అంటూ కేసీఆర్ ని విమర్శించారు.
మేం కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే… కొందరు వాళ్ల భవిష్యత్ చీకటిమయమవుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలని ఉద్దేశించి రేవంత్ ఫైర్ అయ్యారు. పది నెలల మా పాలనపై వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ పది రోజుల్లో తిప్పి కొడదాం అని శ్రేణులకు పిలుపునిచ్చారు. వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడిన చరిత్ర కేసీఆర్ (KCR) ది.. వడ్లు పండించండి.. సన్నాలు వేయండి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పిన చరిత్ర మాది అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.