Monday, May 12, 2025
HomeతెలంగాణVirat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“భారత క్రికెట్ చరిత్ర పుటల్లో విరాట్ కోహ్లీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కోహ్లీ విజయవంతంగా కొనసాగించారు. ఆట పట్ల అంకితభావం, అత్యున్నత క్రమశిక్షణతో ఎన్నో రికార్డులు నెలకొల్పి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. టెస్టు క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ, మిగిలిన ఫార్మాట్లలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలి” అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News