Saturday, November 15, 2025
HomeతెలంగాణIndia vs Pak: తెలుగోడి దెబ్బ అదుర్స్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

India vs Pak: తెలుగోడి దెబ్బ అదుర్స్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

CM Revanth Reddy congratulated Team India: ఆసియా కప్ విజేతగా నిలిచిన టీం ఇండియాకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిందని అన్నారు. ఈ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను అభినందించారు. తెలుగోడి దెబ్బకు వర్ వన్ సైడ్ అయ్యిందని తెలిపారు. అంతర్జాతీయస్థాయి క్రికెట్ లో తెలంగాణకు తిలక్ వర్మ గొప్ప పేరు తెచ్చాడని కొనియాడారు. క్షణక్షణం నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ గెలుపుతో ఈ టోర్నీలో పాక్‌ను మూడుసార్లు చిత్తు చేసిన ఏకైక జట్టుగా భారత్ నిలిచిందని తెలిపారు.

- Advertisement -

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి: ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. పాక్ పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు కావడం పట్ల.. హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తెచ్చామని గుర్తుచేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.

తెలుగోడి పోరాట పటిమ: 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5), సూర్య (1), గిల్ (12) త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి అంచున ఉన్న భారత ఇన్నింగ్స్‌ను యువ సంచలనం తిలక్ వర్మ (69* పరుగులు, 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) భుజానెత్తుకున్నాడు. నాలుగో వికెట్‌కు సంజు శాంసన్ (24)తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. శాంసన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబె (33 పరుగులు 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తిలక్ వర్మ దూకుడు పెంచాడు. ఈ జోడీ అద్భుతంగా ఆడి భారీ షాట్లతో స్కోరు బోర్డు వేగాన్ని పెంచింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సిక్స్ బాదాడు. చివరి 3బంతుల్లో కేవలం ఒక్క పరుగు కావాల్సిన సమయంలో రింకు సింగ్ ఫోర్‌ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఒత్తిడిని తట్టుకొని తిలక్ వర్మ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad