కొత్త మద్యం బ్రాండ్ల(New Liquor Brands)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానం అనుసరించాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి.. నిర్ణీత వ్యవధిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాలని తెలిపారు.
చెత్త పేర్లతో బ్రాండ్లు తీసుకొచ్చే నాసిరకం కంపెనీలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న ఎలైట్ బార్లు, మద్యం షాపుల కేటాయింపుల విషయంలో కొత్త విధానం తీసుకొస్తున్నామన్నారు. గతంలో టానిక్ లాంటి ఎలైట్ షాపులకు అనుమతించటంతో బడా వ్యాపారులు ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్నారు. ఇకపై లేకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.