Asia Cup Hero Tilak Varma: ఆసియా కప్-2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన యువ సంచలనం, తెలంగాణ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, మంగళవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్న తిలక్, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి యువ క్రికెటర్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి, మెమొంటోను అందజేశారు. క్రికెట్‌లో తిలక్ ప్రయాణం, కష్టాలు, సాధించిన విజయాల గురించి సీఎం ఆరా తీశారు. తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.
సమావేశం సందర్భంగా, తిలక్ వర్మ తన అంతర్జాతీయ మ్యాచ్‌ల క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు. ఈ అపురూపమైన బహుమతిని సీఎం స్వీకరించి, తిలక్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రికెట్‌ను ప్రోత్సహించే అంశాలపై ముఖ్యమంత్రి, తిలక్ వర్మ మధ్య కొంత చర్చ జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులను తన ఆటతో ఉర్రూతలూగిస్తున్న తిలక్ వర్మను సీఎం అభినందించడం యువ క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.


