CM Revanth Reddy House wall Demolished: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. చట్టాలు చేయడం మాత్రమే రాజనీతి కాదు.. ఆ చట్టాలను అమలుపరచడంలోనే అసలైన రాజనీతి దాగి ఉందని రేవంత్ రెడ్డి నిరూపించారు. చట్టాలను కేవలం సామాన్యులు మాత్రమే పాటించడం కాదు.. తాము కూడా చట్టాలకు లోబడే ఉంటామనే సందేశాన్ని .. తన సొంత జిల్లా నుంచి ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు.
సీఎం ఇంటి ప్రహారీని కూల్చిన అధికారులు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి. అయితే ఆ గ్రామంలో ఇటీవల రూ. 8 కోట్లతో రహదారి విస్తరణ పనులను అధికారుల చేపట్టారు. రోడ్డు పనుల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని అధికారులు రెండురోజుల క్రితం కూల్చివేశారు.
ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం: గ్రామంలో నాలుగు వరుసల తారురోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణలో 43 మంది ఇళ్లతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని సైతం పడగొట్టారు. అయితే ప్రస్తుతం ప్రహరీ పునర్నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు రెండు నెలల క్రితంమే సీఎం ఆదేశించారని అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేయిస్తున్నామని పేర్కొన్నారు.


