Sunday, July 13, 2025
HomeతెలంగాణRevanth Reddy: వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy: వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Vanamahothsavam In Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 18.03 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంను నిర్ణయించింది. ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మొక్కల నాటింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

- Advertisement -

హరితహారానికి బదులుగా..

సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ప్రభుత్వం ఈ పథకాన్ని హరితహారం పేరుతో నిర్వహించేది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో మొక్కలను నాటేవారు. తద్వారా రాష్ట్రంలో అటవీ సంపద పెరిగి.. పచ్చదనం నిండి ఉంటుందని భావించేవారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పటి ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో నిర్వహిస్తోంది. ఈ పథకంలో భాగంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News