రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో నెలకొల్పిన ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కు(Experium Park)ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డి, సీఎం రమేశ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
కాగా పారిశ్రామికవేత్త రాందేవ్రావ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ ఎక్స్‌పీరియంను తీర్చిదిద్దారు. ఇందులో 25వేల జాతుల మొక్కలతో పాటు 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి.అంతేకాకకుండా లక్ష రూపాయల నుంచి రూ.3.5కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా నిలవడం విశేషం. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.