CM Revanth Reddy| తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యం ఉద్యోగ నోటిషికేషన్లతో ప్రజాపాలనలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. పెద్దపల్లిలో ‘యువవికాసం’ పేరుతో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి ఆయన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో యువ వికాసం గురించి ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు.
“మొన్న కొలువులే ఆలంబనగా.. కొలిమిలా మండిన ఉద్యమం. నిన్న కొలువులే ఆకాంక్షగా.. జంగ్ సైరనై మోగిన నా రణం. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం.. ప్రజా పాలనలో యువ వికాస వసంతం ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామకం. నిత్య నోటిఫికేషన్ల తోరణం.. ఏడాది ప్రజా పాలనలో తగ్గుతున్న నిరుద్యోగం. ఈ సంతోషాన్ని,ఆ ఆనందాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు నేడు వస్తున్నా పెద్దపల్లికి” రేవంత్ రెడ్డి వెల్లడించారు.