Tuesday, February 4, 2025
HomeతెలంగాణTG Assembly: తెలంగాణలో బీసీల జనాభా ఎంతంటే?

TG Assembly: తెలంగాణలో బీసీల జనాభా ఎంతంటే?

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణను చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీలో మంత్రివర్గం ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ సర్వేను ప్రవేపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా సర్వేను నిర్వహించామని తెలిపారు. మొత్తం 75 అశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే నిర్వహించామన్నారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే కొనసాగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించామన్నారు.

- Advertisement -

మొత్తంగా రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశామన్నారు. 96.9 శాతం కుటుంబాలు సర్వేలో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం(1,64,09,179) , ఓసీ జనాభా 17.79 శాతం(41.21లక్షలు), ఎస్సీలు 17.43 శాతం(61,84,319) , ఎస్టీలు 10.45 శాతం(37,05,929) , బీసీ మైనారిటీలు 10.08 శాతం(35.76లక్షలు)ఉన్నారని రేవంత్ ప్రకటించారు.

కులగణన సర్వే తప్పుడు తడకగా ఉందంటూ విపక్షాలు ఆరోపణల్లో వాస్తవం లేదని విమర్శించారు. సర్వేకు ముందు పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరిచేశామని సభకు తెలిపారు. ప్రతి 150 ఇళ్లకు ఒక బ్లాక్ గుర్తించి సర్వే చేపట్టి గుర్తుచేశామని చెప్పుకొచ్చారు. ముందుకు స్టిక్కర్లు అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించామని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేక సార్లు శిక్షణను ఇచ్చామని అన్నారు. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారబోతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News