తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని(Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభించింది. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.4 లక్షల రుణాలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహాకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ ఐదో తేదీ లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
కాగా రూ. 6వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నామని ఇప్పటికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం తీసుకువచ్చినట్లు తెలిపారు.