Wednesday, January 21, 2026
HomeతెలంగాణCM Revanth: ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు: సీఎం రేవంత్

CM Revanth: ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు: సీఎం రేవంత్

CM Revanth reddy comments on Jaipal reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్మరించుకుంటూ, ఆయన నమ్మిన సిద్ధాంతాలను రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన ‘జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్, జైపాల్ రెడ్డి పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర స్థాపనలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. జైపాల్ లేకపోతే తెలంగాణ సాధ్యపడేది కాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

జైపాల్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమీక్షిస్తూ, రేవంత్ రెడ్డి ఆయనను శత్రువులు లేని వ్యక్తిగా అభివర్ణించారు. అంటే రాజకీయ విభేదాలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేకుండా ఉండేవారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం (RTI) అమలులో జైపాల్ రెడ్డి పోషించిన కీలక పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధంగా ఆ చట్టాన్ని నిలబెట్టేందుకు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.

కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి జైపాల్ తీసుకున్న వినూత్న చర్యలు, సంస్కరణల పట్ల ఆయన చూపిన నిబద్ధతపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. పీవీ నరసింహారావు తర్వాత దేశ స్థాయిలో పేరు తెచ్చుకున్న తెలంగాణ నాయకుడిగా జైపాల్ రెడ్డి మాత్రమే నిలిచారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ధనవినియోగం తగ్గించాలన్న జైపాల్ దృక్పథాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు మూల్యాల నుండి మేనేజ్‌మెంట్ వైపు మొగ్గుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఐడియాలజీ పాలిటిక్స్ క్రమంగా కనుమరుగై, తాజా పరిస్థితుల్లో స్విగ్గీ పాలిటిక్స్ రావడం బాధాకరం,” అంటూ రాజకీయాల్లో పునాది సిద్ధాంతాల అవసరాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News