CM Revanth Reddy Master Plan: సీఎం రేవంత్‌రెడ్డి అంటేనే ఊహకందని ఎత్తుగడలకు నిలువెత్తు నిదర్శనం. తన ప్రతీ ఆలోచన రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని విధంగా ఉంటుంది. రాజకీయ చదరంగంలో మాజీ సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తినే బోల్తా కొట్టించాడంటే.. తన రాజకీయ చతురతను మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరో రాజకీయ ఎత్తుగతో.. బీఆర్‌ఎస్ గుండెల్లో గుబులు పుట్టించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ.. రాజకీయ చదరంగంలో తనదైన ఎతుగతో పావులు కదిపారు. మైనార్టీ ఓట్లే టార్గెట్‌గా అజార్‌కు మంత్రి పదవి ఇచ్చి .. జూబ్లీహిల్స్ రాజకీయాలను మొత్తం ముస్లిం ఓటర్ల చుట్టు తిప్పే ప్రయత్నం చేశారు.
బీఆర్‌ఎస్‌కు ఊహించని ఝలక్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. దీంతో ముస్లిం ఓటు బ్యాంకుపై గంపెడాశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అనివార్యమైన ఈ ఎన్నిక గులాబీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోకుంటే పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్న బీఆర్‌ఎస్.. గెలుపు లక్ష్యంతో పోరాడుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక లక్షా ఇరవై వేేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. దీంతో బీఆర్‌ఎస్ వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఇటీవల కాలంలో ముస్లిం లీడర్లు, కేడర్ పెద్దసంఖ్యలో గులాబీ కండువా కప్పుకోవడం తమకు కలిసొస్తుందని భావించింది. హైదరాబాద్ యూత్ కరేజ్ ప్రెసిడెంట్ సల్మాన్ ఖాన్ నామినేషన్ తిరస్కరణ అనంతరం.. అతను కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సల్మాన్ ఖాన్‌ను పార్టీలోకి చేర్చుకునే సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తమ హయాంలో ముస్లిం మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం ముస్లింలకు గుండు సున్నా అని విమర్శించారు.
పావులు కదుపుతున్న సీఎం: మంత్రివర్గంలో తమ వర్గానికి చోటు లేకపోవడంపై చాలామంది ముస్లింలు కోపంగా ఉన్నారని బీఆర్‌ఎస్ అంచనా వేసింది. దీంతో ఎత్తుకు పైఎత్తు వేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అజారుద్దీన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. మైనార్టీ ఓట్లే టార్గెట్‌గా అజార్‌కు మంత్రి పదవి దక్కేలా పావులు కదిపాడు. కాంగ్రెస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం బీఆర్‌ఎస్‌ను గందరగోళంలోకి నెట్టింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో మంత్రివర్గంలో తమ వర్గానికి ప్రాతినిధ్యం లభిస్తుండటంతో ముస్లిం ఓటర్లు హస్తం వైపు మొగ్గు చూపై అవకాశం ఉందని.. గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది.
ఓటమి భయంతోనే మంత్రి పదవి: కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే బస్తీ వాసులతో పాటుగా మైనార్టీలందరూ బీఆర్‌ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. అది జీర్ణంచుకోలేకనే ..అజారుద్దీన్‌ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ముస్లింలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని అన్నారు. కేవలం ఉపఎన్నిక కోసం మాత్రమే అజార్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని తెలిపారు. ఇరుపార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ పరిధిలోని మైనార్టీల మనసులో ఏముందో తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే రేవంత్ రెడ్జి తీసుకున్న అనూహ్య నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు మేలుచేస్తుందో వేచిచూడాల్సిందే.


