తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో(Satya Nadella) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి సీఎం చేరుకున్నారు. అనంతరం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ గురించి నాదెళ్లతో చర్చిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించాలని కోరే అవకాశముంది. ఐటీ స్టార్టప్‌ల రంగంలో మైక్రోసాఫ్ట్ మద్దతును కూడగట్టే అంశంపై ఆయనతో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.