Tuesday, April 15, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy)పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్టులో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్టులో ఏకంగా 13 మంది ఎక్కారు. దీంతో ఓవర్ వెయిట్ కారణంగా ఆ లిఫ్టు మొరాయించింది. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, అధికారులు లిఫ్ట్ ఓపెన్ చేసి రేవంత్ రెడ్డిని వేరే లిఫ్టులో పంపారు. దీంతో పార్టీ నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News