జన గణనలో కుల గణన(Caste census) చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణన కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాహుల్ గాంధీ మార్గనిర్దేశం ప్రకారం, తెలంగాణలో కుల గణనను సక్రమంగా నిర్వహించి. దేశానికి మార్గదర్శకంగా నిలిచామన్నారు.
కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో 8వేల పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఈ విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్ నుంచి సీఎస్ వరకు పలుమార్లు సమీక్ష నిర్వహించామని అనేక సలహాలు, సూచనలు వచ్చాయన్నారు. తెలంగాణ మోడల్ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కులగణన ప్రక్రియలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రేవంత్ సూచించారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా కుల గణన చేయాలన్నారు. కాగా జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.