Friday, November 15, 2024
HomeతెలంగాణRevanth Reddy | రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలే

Revanth Reddy | రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలే

రైతులను ఇబ్బంది పెట్టేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Also Read : మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన సీఎం.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News