Thursday, April 3, 2025
HomeతెలంగాణRevanth Reddy: ఢిల్లీ బీసీ ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఢిల్లీ బీసీ ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు(BC protest) నిరసనకు దిగాయి. ఈ నిరసనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్, సినీ నటుడు సుమన్‌ తదితరులు ఈ నిరసనకు హాజరయ్యారు. ఇక ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం తెలిపారు.

- Advertisement -

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్‌లోనూ ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు HCU భూములను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News