CM Revanth Reddy| తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి(Srikantha Chary) వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.
- Advertisement -
కాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయిన శ్రీకాంతాచారి 2009లో అమరుడైన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో రాష్ట్ర సాధనకై హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహుతి చేసుకున్నాడు. కాలిపోయిన గాయాలతో నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.