CM Revanth Reddy Birthday Photo with 57 kgs Ration Rice: నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి 57 వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు బర్త్‌డే గిఫ్ట్స్ పంపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్.. సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు.
శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మెట్టు సాయి కుమార్ వినూత్న ఆలోచన చేశారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని గుర్తు చేస్తూ.. 57 కిలోల సన్న బియ్యంతో సృజనాత్మకంగా ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఈ మేరకు మెట్టు సాయి కుమార్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం వల్ల వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అందుకు ఆయన 57 వ పుట్టినరోజు సందర్భంగా 57 కిలోల సన్నబియ్యంతో ఇలా చిత్రపటం తయారు చేసి బహుమతిగా అందించడం సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరుకుంటున్నాం. అని సాయి కుమార్ అన్నారు.
ఈ వినూత్న కానుక పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న కృషి కారణంగా ప్రజల్లో ఆయనకు విశేషమైన ఆదరణ లభిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కేవలం గిఫ్ట్ కాదని.. రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలకు ప్రతీక అని వెల్లడించారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే సీఎం సార్ అంటూ విషెస్ చెబుతున్నారు.


