రాజస్థాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జైపూర్(Jaipur) చేరుకున్నారు. జైపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం అక్కడ జరగనున్న బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
- Advertisement -
అనంతరం రేపు ఉదయం ఢిల్లీ(Delhi) చేరుకుంటారు. రెండు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉండనున్న ఆయన AICC పెద్దలతో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ముఖ్య నేతలు కూడా ఉండనున్నారు.