CM Revanth Reddy: అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని.. చట్టం ముందు అంతా సమానమేనని తెలిపారు. ఇందులో తన జోక్యం ఏమి ఉండదని స్పష్టంచేశారు. తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయింది కాబట్టి పోలీసు చర్యల్లో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు చట్ట పరంగా ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు.
- Advertisement -