Saturday, November 15, 2025
HomeతెలంగాణSLBC Tunnel Project: బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీపై నిర్లక్ష్యం.. త్వరలోనే టన్నెల్‌ పూర్తి చేస్తాం.. సీఎం...

SLBC Tunnel Project: బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీపై నిర్లక్ష్యం.. త్వరలోనే టన్నెల్‌ పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్ స్పష్టం

CM Revanth Reddy Review On SLBC Tunnel Project Works: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తికాకపోవడం బాధాకరమని తెలిపారు. నేడు (సోమవారం) నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నేవారిపల్లెలో పర్యటించిన సీఎం.. హెలీ మాగ్నటిక్‌ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్‌, అధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. టన్నెల్‌ బోర్‌ మిషన్‌తో పనులు చేయడం కష్టంగా మారిందని, పనులపై బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. టన్నెల్‌ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్‌ పనుల అంచనా విలువ రూ.1,968 కోట్లుగా ఉండేది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్‌ పనుల్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. తెలంగాణ వచ్చే నాటికి కాంగ్రెస్‌ హయాంలోనే 30 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మీ టన్నెల్‌ పూర్తి చేయాల్సి ఉండగా.. అస్సలు పట్టించుకోలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్‌ చూస్తూ ఊరుకున్నారు. రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు త్రాగు నీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతో బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు వెచ్చించింది. ఆ మొత్తంలో కాళేశ్వరం కాంట్రాక్టర్లకే రూ.1.06 లక్షల కోట్లు చెల్లించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసింది. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదు.’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ నిర్లక్ష్యం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 వేల క్యూసెక్కులు, 30 టీఎంసీల నీటిని గ్రావిటేషన్ పద్ధతిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల తాగు నీటి అవసరాలు తీర్చడానికి 2005లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎల్‌బీసీ) మొదలు పెట్టారని సీఎం తెలిపారు. అప్పటి నుంచి 2014 వరకు దాదాపు 32 కిమీల టన్నెల్ పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యకు పరిష్కారం చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డామన్నారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టిందని, దీంతో 10 ఏళ్లు ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగ తీసుకొని టన్నెల్ బోర్ రిపైర్ పనులు క్లియర్ చేసి పనులు మొదలు పెట్టామని, కాని అనుకోకుండా ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఖచ్చితంగా కేసీఆర్(KCR) దేనని సీఎం మండిపడ్డారు. నీరు, బురద ఉధృతంగా ఉండటం వలన రిపేర్ పనులకు కొంత ఆటంకం కలిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad