CM Revanth Reddy| ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసును తగ్గించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీ(NCERT)లో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంత్సరాల నిబంధనను సవరించాలని సూచించారు. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించినప్పుడు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వయసు కూడా తగ్గించాలన్నారు. 21 ఏళ్లు నిండిన వారు చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్నారు. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. 21 ఏళ్లు నిండిన యువత ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు… 21 ఏళ్లు నిండిన వారు చట్టసభ్యులుగా కూడా రాణిస్తారని తెలిపారు. ఈ అంశంపై స్పీకర్ తీర్మానం చేసి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని వెల్లడించారు.