Friday, November 8, 2024
HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ ఉనికి లేకుండా చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన...

CM Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ ఉనికి లేకుండా చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy| బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్(KCR) కుటుంబం రాజకీయ జీవితం గురించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది లోపు కేసీఆర్ రాజకీయ ఉనికి లేకుండా చేయడమే తన టార్గెట్ అని తెలిపారు. ఇప్పటికే కేటీఆర్‌(KTR)తోనే కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేశామన్నారు. ఇక ఇప్పుడు బావ హరీష్‌రావు(HarishRao)ను వాడి రాజకీయాల్లో బామ్మర్ది కేటీఆర్‌ ఉనికి లేకుండా చేస్తామని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. పైవిధంగా హాట్ కామెంట్స్ చేశారు. బావబామ్మర్దులను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు. అవసరమైతే పోలీసులను పెట్టి నిర్బంధించొచ్చు కానీ అది తన విధానం కాదన్నారు. వారిద్దరిని డీల్ చేసేందుకు ఎలా ప్లాన్ చేయాలో అలా చేస్తామన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. విచారణ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు ఉండదన్నారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ పాస్ పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్టు అవుతారన్నారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఇక జన్వాడ ఫాంహౌస్ పార్టీ గురించి మాట్లాడుతూ దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లను చూస్తాం కానీ.. కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లో మాత్రం సారా బుడ్లను చూడాల్సి వస్తోందన్నారు. దీపావళి పార్టీ అయింతే క్యాసినో కాయిన్స్ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. లిక్కర్ బాటిల్స్, క్యాసినో కాయిన్స్ ఉంటే దానిని దీపావళి పార్టీ అని ఎలా చెబుతారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కావడమే తన కల అని.. ఇప్పుడు తన కల నెరవేరిందన్నారు. సీఎం పోస్టు కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమీ లేవని స్పష్టంచేశారు.

మూసీ(Musi Project) విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలకు మంచి చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. నవంబర్ 1న బాపూఘాట్ నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.బాపూఘాట్ నుంచి మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభిస్తామన్నారు. నవంబర్ నెల లోపు ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ ప్రతిపాదనలు సూచించవచ్చన్నారు. దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహిస్తామని రేవంత్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News