Saturday, November 23, 2024
HomeతెలంగాణCM Revanth : కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలుండాలి

CM Revanth : కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలుండాలి

ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ మరియు బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని చెప్పారు. శుక్రవారం ఆయన కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం… కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరం అని సీఎం రేవంత్ (CM Revanth) సూచించారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి.. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గలకూ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌ (IAMC) నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు.

“మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చు. IAMC అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు…. దేశం మొత్తానికి ఈ సెంటర్‌‌ ఉపయోగపడుతుంది. IAMCని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దు.. కామన్‌ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా IAMC సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News