తెలంగాణ పోలీస్ శాఖను చూసి గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా అభినందనలు చెప్పారు.
- Advertisement -
“వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటాను.” ఆయన వెల్లడించారు.


