CM Revanth Reddy| కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ(Musi) నది ప్రక్షాళన, హైడ్రా(Hydra) నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసీన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
“నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి…నదులను కబళిస్తే… మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజా ఆరోగ్యం…పటిష్ఠ ఆర్ధికం…పర్యావరణ కోణాల్లో… ప్రపంచ స్థాయి ప్రమాణాలతో…అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్కు మూసీ ఒక వరం కావాలి…కానీ శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్న…ప్రజా ప్రభుత్వ సంకల్పం…ఈ తరానికే కాదు…తరతరాలకు మేలు చేసే నిర్ణయం.ఈ నిర్ణయానికి అండగా నిలిచే…ప్రతి వ్యక్తికి…ప్రతి వ్యవస్థకి… ధన్యవాదాలు” అని చెబుతూ బెంగళూరు నగరానికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగులను జత చేశారు.