Revanth: సొంతగూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో మాటిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే పథకం ఫలాలు లబ్ధిదారులకు అందేలా చొరవ చూపుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరో కీలక ముందడుగుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా నిలిచింది. సొంతగూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు కొండంత భరోసా నింపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహప్రవేశ మహోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పథకాన్ని 2024 మార్చి 11న భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీతారాముల వారి చెంతనే ఇందిరమ్మ ఇళ్ల నమూనాను విడుదల చేశారు. ఇప్పుడు ఆదే జిల్లాలో ఇళ్లను ప్రారంభించారు. దామరచర్ల సమీపంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పేదింటి కళ నేరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు చేరుకున్నారు.
Read Also: Bronco Test: టీమిండియా ప్లేయర్లకు గుడ్ న్యూస్.. బ్రాంకో టెస్టు నుంచి ఊరట
రేవంత్ రెడ్డి ట్వీట్
పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. “సొంత ఇల్లు అంటే.. ఇటుకల గోడలు, సిమెంటు శ్లాబులు కాదు.. పేదల ఆత్మగౌరవం.. ఆ ఆత్మగౌరవాన్ని వారికి అందించే.. ప్రయత్నమే ప్రజా ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సొంత ఇంటి గృహ ప్రవేశమంటే.. అది పేదల ఆత్మగౌరవ ఉత్సవం.. వారి ఆత్మబంధువుగా.. నేడు నేను వారి గృహ ప్రవేశానికి.. అతిథిగా వెళుతున్నాను. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతుండగా, నారాయణపేట జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 18,344 ఇళ్లకు 9,726 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మొట్టమొదటగా పథకం ప్రారంభానికి కేంద్రంగా నిలుస్తున్న బెండా పాడు గ్రామానికి 310 ఇళ్లు మంజూరు అయ్యాయి” అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: Air India: వరుస ఆఫర్లను ప్రకటిస్తున్న ఎయిరిండియా..!


