Wednesday, November 20, 2024
HomeతెలంగాణCM Vemulawada Tour | కోడె మొక్కులు చెల్లించుకున్న సీఎం

CM Vemulawada Tour | కోడె మొక్కులు చెల్లించుకున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు వేములవాడ పర్యటన (Vemulawada Tour)లో ఉన్నారు. అందులో భాగంగా ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేసి పూజ నిర్వహించారు.

- Advertisement -

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు.

పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి వర్యులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని సీఎంకి వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఆయనకి వివరించారు.

ఈ పర్యటనలో సీఎం తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News