Friday, April 4, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: వరంగల్ దశ-దిశ మార్చేందుకు వస్తున్నాను: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: వరంగల్ దశ-దిశ మార్చేందుకు వస్తున్నాను: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. “తెలంగాణ చైతన్యపు రాజధాని..కాళోజీ నుండి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల, స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ, హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతం.దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్, వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.

- Advertisement -

కాగా వరంగల్ పర్యటనలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.22 కోట్లతో చేపట్టనున్న మహిశా శక్తి భవన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ.95 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News