CM Revanth Reddy| తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు(Group-2 Exams) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రూప్-2 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు గ్రూప్ -2 పరీక్షలకు హాజరవుతున్న ఉద్యోగార్ధులందరికీ శుభాకాంక్షలు. ఈ పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ ప్రభుత్వంలో చేరి రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
కాగా 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు టీజీపీఎస్సీ(TGPSC) పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. ఇక ఈ పోస్టుల కోసం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.