Tuesday, September 17, 2024
HomeతెలంగాణCM Revanth review on Ganesh Utsavalu: గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష

CM Revanth review on Ganesh Utsavalu: గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష

గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని, అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -

నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానంటూ రేవంత్ ప్రకటించారు.

చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించాలని, నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరముందన్నారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని, వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందని రేవంత్ అన్నారు. సెప్టెంబర్ 17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News